శృంగారం గొప్పతనాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ప్రశింసించారు. బుధవారం విడుదల చేసిన ఓ డ్యాక్యుమెంటరీలో ఆయన శృంగారం గురించి వివరించారు. దేవుడు మనిషికి అందమైన వస్తువులలో ఇది ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది రోమ్ లో 20ఏళ్ల వయస్సలో ఉన్న పది మంది యువకులతో ముచ్చింటించిన పోస్ ప్రాన్సిస్.. యువకులు అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలను.. ది పోస్ ఆన్సర్స్ పేరుతో డిస్నీ ప్రొడక్షన్ డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది.
Read Also : Man Buried by Snow: మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన మరో వ్యక్తి
ఫ్రాన్సిస్ తో ముచ్చటించిన ఈ పది మంది ఎల్జీబీటీ హక్కులు, అబార్షన్, పోర్న్ పరిశ్రమ, శృంగారం, విశ్వాసం, క్యాథిలిక్ చర్చిలో లైంగిక వేధింపులు సహా అనేక అంశాలపై ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా పోప్ శృంగారం గురించి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దేవుడు మనిషికి ఇచ్చిన అందమైన వస్తువులో శృంగారం ఒకటి అని వ్యాఖ్యానించారు. హస్త ప్రయోగం గురించి ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని మీరు లైంగికంగా వ్యక్తీకరించడం గొప్పతనం.. కాబట్టి నిజమైన లైంగిక వ్యక్తీకరణను దూరం చేసే ఏదైనా మిమ్మిల్ని తగ్గిస్తుంది.. ఈ గొప్పతనాన్ని తగ్గిస్తుంది అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
Read Also : AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్
ట్రాన్స్ జెండర్ వ్యక్తి అంటే ఏంటో మీకు తెలుసా.. అన్న ప్రశ్నకు పోన్ నిశ్చయంగా బదులిచ్చారు. అలాగే, ఎల్జీబీటీ వ్యక్తులను కాథలిక్ చర్చి తప్పనిసరిగా స్వాగతించాలని ఆయన పునరావృతం చేశారు. అందరూ దేవుడి బిడ్డలు ఆయనే తండ్రి భగవంతుడు ఎవర్నీ తిరస్కరించడు.. కాబట్టి చర్చి నుంచి ఏ ఒక్కర్నీ బయటకు పంపే హక్కు నాకు లేదు అని పోప్ ప్రాన్సిన్ తెలిపారు. గర్భవిచ్ఛిత్తి చేసుకున్న మహిళల పట్ల మత ప్రబోధకులు దయ చూపాలని.. అయితే ఆ పద్దతి ఆమోదయోగ్యం కాదని అబార్షన్ లపై ఫ్రాన్సిస్ అన్నారు. వాటిని వారి పేరుతో పిలవడం మంచిది. అబార్షన్ చేయించుకున్న వ్యక్తితో కలిసి రావడం ఒక విషయం.. చర్యను సమర్థించడం మరొక విషయం అని అన్నారు. పోప్ వ్యాఖ్యలను వాటికన్ అధికారిక వార్తాపత్రిక లోసెర్వోటెరో రొమానాలో ప్రచురించింది. యువకులతో ఆయన సంభాషణను ఓపెన్ అండ్ సిన్సియర్ డైలాగ్ గా అభివర్ణించింది.