Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్‌పో ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో వాహన తయారీదార్లతో పాటు విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ భాగాలు, టైర్- ఇంధన స్టోరేజ్ తయారీదార్లు, వాహన సాఫ్ట్‌వేర్ సంస్థలు, మెటీరియల్ రీసైక్లర్‌లు తమ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే, బియాండ్ బౌండరీస్: కో-క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చెయిన్ పేరిట ఈ గ్లోబల్ ఎక్స్‌పోను 3 వేదికలు విభజించారు. అందులో ఒకటి ఢిల్లీలోని భారత్ మండపం, రెండోది ద్వారకా దగ్గర యశోభూమి, మూడోది గ్రేటర్ నోయిడాలోని ఢిల్లీ, ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లలో జరగనుంది.
Read Also: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే
ఇక, గ్లోబల్ ఎక్స్‌పోను పరిశ్రమ సంఘాలు ఇండియన్ స్టీల్ అసోసియేషన్, ఏటీఎంఏ, ఐసీఈఎంఏ, సియామ్, ఏసీఎంఏ, ఐఈఎస్‌ఏ, నాస్కామ్, సీఐఐ, మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ ఎక్స్‌పోకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 5,100 మంది అంతర్జాతీయ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.