దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్‌లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి…
మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన 3 కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఇందులో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ కూడా ఉంది. సుజుకీకి చెందిన ప్రముఖ స్కూటర్ యాక్సెస్ ను కంపెనీ నవీకరించి విడుదల చేసింది. కంపెనీ Gixxer SF 250ని కూడా విడుదల చేసింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం...
మారుతీ సుజుకి ఇండియా ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది. కంపెనీ ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. కంపెనీ మార్చిలో పూర్తి ఫ్లాష్‌ని లాంచ్ చేస్తుంది. భారతీయ మార్కెట్లో ప్రవేశించనున్న విటారా ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ కారులో మీరు ప్రత్యేక ఫీచర్ల గురించి…
Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్‌పో” కొనసాగుతుంది.
Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.