టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికిన జియో మరో సంచలనానికి సిద్ధం అయింది వినాయకచవితికి జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయాలని భావించినా కుదరలేదని జియో తెలిపింది. దీంతో ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
రిలయెన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ విడుదల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది. గతంలో విడుదల చేసిన జియో ఫోన్లు ఎంతో ఆదరణ పొందాయి. ఈసారి కూడా జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాల్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రిలయన్స్ సరికొత్త బిజినెస్ మోడల్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని అమ్మే అన్నీ లోకల్ స్టోర్ల సాయంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు రిలయన్స్ రిటైల్ ప్లాన్ చేసింది. జియో మార్ట్ డిజిటల్ సేవలు లేదా రిలయన్స్ డిజిటల్ సేవలు అందుబాటులోకి లేని వారికి ఆఫర్ ఉపయుక్తంగా వుంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ సేల్స్ పెంచేందుకు రిలయన్స్ భారీ ప్రయత్నాలు చేస‍్తుంది. రిలయన్స్ రిటైల్లో జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు దారులకు ఆఫర్లు ప్రకటించింది. ఫోన్ కొనుగోలుపై ఈఎంఐ, ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది.
నవంబర్ 4న జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో ధృవీకరించింది. ఈ ఫోన్ ఫీచర్స్ పై వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఫీచర్స్ లీక్ అయ్యాయి. 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. అంతేకాదు.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్, అడ్రినో 306 జీపీయు, 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ వుంది. అలాగే, 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా,13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వుంది. స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ తో పాటు ఆండ్రాయిడ్ గో ఓఎస్ నిక్షిప్తమయి వుంది. దీని ధర సుమారుగా రూ.3,499 వుంటుందని అంచనా వేస్తున్నారు.