అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలోనే టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ కు తరలించాలని కంపెనీ యోచిస్తున్నట్లు స్పష్టమైంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్లోనే తయారు చేస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. అమెరికాలో భారీ సంఖ్యలో విక్రయించబోయే ఐఫోన్లకు భారత్ కీలక తయారీ కేంద్రంగా అవుతుందని పేర్కొన్నారు. దీంతో భారతీయుల్లో ప్రస్తుతం ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐఫోన్‌లు మన దేశంలో తయారైతే దాని ధర తగ్గుతుందా? అనే సందేహం మొదలైంది.
READ MORE: Bilawal Bhutto: ‘‘ఇది రహస్యం కాదు’’.. ఉగ్రవాదాన్ని అంగీకరించిన బిలావల్ భుట్టో..
వాస్తవానికి.. చైనా ప్రస్తుతం ఐఫోన్ల తయారీ కేంద్రంగా ఉంది. అయితే ఈ ఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ మార్చినా ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించిది. చైనాలో ఐఫోన్ తయారీకి 938 డాలర్లు ఖర్చవుతుందని.. భారత్‌కు వచ్చేసరికి 1,008 డాలర్లు ఖర్చవుతుందని కథనంలో పేర్కొన్నారు. అమెరికాలో ఐఫోన్లను తయారుచేయాలని భావిస్తే ఇంతకంటే అదనంగా 30 శాతం ఖర్చవుతుందని స్పష్టమైంది. కెమెరా, స్క్రీన్ మరియు ప్రాసెసర్ వంటి ప్రధాన భాగాల ధర రెండు ప్రదేశాలలో ఒకే విధంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో సరఫరాదారుల లాభాల మార్జిన్లు కొంచెం ఎక్కువగా ఉండటం దీనికి కారణం. అందుకే చైనాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్లను తయారుచేస్తే 2శాతం మాత్రం అధిక వ్యయం అవుతుందని తెలుస్తోంది. ఇది అమెరికాలో ఖర్చయ్యేదానితో పోలిస్తే చాలా తక్కువట. అయినా భారత్‌లో ధరల్లో ఏ పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
READ MORE: Amaravati Restart Event Live Updates: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక లైవ్ అప్డేట్స్..