అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలోనే టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ కు తరలించాలని కంపెనీ యోచిస్తున్నట్లు స్పష్టమైంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్లోనే తయారు చేస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. అమెరికాలో భారీ…