India: అమెరికాని వెనక్కి నెట్టి భారత్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G మొబైల్ మార్కెట్‌గా అవతరించిందని నివేదికలు వెల్లడించాయి. చైనా తర్వాత ప్రస్తుతం భారత్ రెండో అతిపెద్ద 5G మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌గా నిలిచింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. గ్లోబర్ 5G హ్యండ్ సెట్ షిప్‌మెంట్స్‌లు 2024 మొదటి అర్ధభాగంలో 20 శాతం పెరిగాయి. ఆపిల్ ఐఫోన్లు 5G హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్‌లు తొలి ప్లేస్‌లో ఉన్నాయి. దాదాపుగా 25 శాతం కన్నా ఎక్కువ వాటాని కలిగి ఉన్నాయి.
ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా 5G హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్‌లకు నాయకత్వం వహించింది, 25 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీనికి ఐఫోన్ 15,14 సహకరించాయి. 5జీ హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బడ్జెట్ విభాగంలో వీటి లభ్యత పెరగడంతో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఈ విభాగంలో అధిక వృద్ధిని సాధించాయి. ‘‘భారత్ ఈ ఏడాది తొలి అర్ధభాగంలో యూఎస్‌ని అధిగమించి రెండో అతిపెద్ద 5జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌గా మారింది. బడ్జెట్ విభాగంలో షియోమీ, వివో, శాంమ్సంగ్, ఇతర బ్రాండ్ల నుంచి బలమైన షిప్‌మెంట్లు ఈ ధోరణికి ప్రధాన కారణం’’ అని సీనియర్ విశ్లేషకుడు ప్రాచీర్ సింగ్ చెప్పారు.
Read Also: Himanta Biswa Sharma: అస్సాంలో రూ.22 వేల కోట్ల కుంభకోణం.. స్పందించిన సీఎం
గెలాక్సీ ఏ సిరీస్, ఎస్ 24 సిరీస్‌లు కలిగిన శాంమ్సంగ్ 21 శాతంతో ఆపిల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2024 ప్రథమార్థంలో 5 జీ మొబైల్స్ టాప్ -10 జాబితాలో ఆపిల్, శాంమ్సంగ్‌కి చెందిన ఐదు మోడళ్లు ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఆపిల్ తొలి నాలుగు స్థానాలను ఆక్రమించింది. భారత్ మాత్రమే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు కూడా 5జీ హ్యాండ్‌సెట్లలో వృద్ధిని సాధించాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, ఆసియా-పసిఫిక్ 63 శాతం వాటాని, 58 శాతం షిప్‌మెంట్లను కలిగి ఉంది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా 5జీ హ్యాండ్‌సెట్ల షిప్‌మెంట్లు రెండంకెల వృద్ధిని సాధించాయి. తక్కువ ధరలలో 5జీ వ్యాప్తి, నెట్వర్క్ విస్తరణ పెరగడంతో ఈ ధోరణి కనిపిస్తోందని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు.