Indigo flight: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. దెబ్బతిన్న ఇండిగో విమానం టెయిల్ సెక్షన్
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం
- దెబ్బతిన్న ఇండిగో విమానం టెయిల్ సెక్షన్
- ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం జరిగిన సంఘటనకు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా వెళ్లనున్న మోడీ.. క్వాడ్ సమావేశానికి హాజరు
Also Read
సెప్టెంబర్ 9న ఇండిగో ఫ్లైట్ నెం. 6E 6054 ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో టెయిల్ సెక్షన్ భారీగా దెబ్బతింది. విమానంపై ఉండే నీలిరంగు పెయింట్ ఊడిపోయింది. తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఇది తీవ్రమైన ప్రమాదంగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు
టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేని తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది నిర్మాణాత్మక నష్టానికి దారి తీస్తుంది. పైలట్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)కి సమాచారం అందించాడు. ఆ తర్వాత ATC ల్యాండ్‌కి క్లియరెన్స్ ఇచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నాయి. రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మరియు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. DGCA సిబ్బందిని తొలగించింది. ప్రయాణికులను దింపి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఇండిగో ఇంకా ప్రకటన ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!