పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న ధరలు నేడు ధరలు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.. ఆదివారం బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 320 వరకు పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,290కి చేరింది.వెండి కూడా భారీగా పెరిగింది. కిలో పై రూ. 1000 పెరిగింది.. రూ. 80,200గా ఉంది.. ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,440కి చేరింది.
*ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* చెన్నై విషయానికొస్తే ఆదివారం ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది..
వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధర పరుగులు పెడుతుంది.. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 పెరగడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. చెన్నైలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 80,200కి చేరింది. ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో ఆదివారం కిలో వెండి ధర రూ. 77,200గా ఉంది.. హైదరాబాద్ లో రూ. 80,200 గా నమోదు అయ్యింది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..