Latest Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జూన్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,180లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,430గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,750లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,730 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 71,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 600 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,700లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,250గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,700ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Aloe Vera Tips: మొటిమలకు గుడ్ బై చెప్పాలంటే.. అలోవెరాతో ఇలా చేయండి
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..