కనుమ రోజున పసిడి ధరలు శాంతించాయి. గత కొద్దిరోజులుగా వెండి, బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. సామాన్యులకు చుక్కులు చూపించేలా ధరలు ఆకాశన్నంటాయి. దీంతో కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. మొత్తానికి ఈరోజు ధరలు దిగొచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.220 తగ్గగా.. కిలో వెండిపై రూ.3,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: BMC Result: కౌంటింగ్ ప్రారంభం.. దూసుకుపోతున్న బీజేపీ కూటమి
బంగారం ధర ఉపశమనం కలిగించింది. తులం గోల్డ్‌పై రూ.220 తగ్గి బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 తగ్గి రూ.1,31,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 తగ్గి రూ.1,07,550 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
ఈరోజు వెండి ధర ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.3,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,92, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,06,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,92, 000 దగ్గర అమ్ముడవుతోంది.