అన్నట్టుగానే సిల్వర్ 3 లక్షల మార్కు దాటేసింది. గతేడాది వెండి ధరలు విలయ తాండవం చేస్తే.. ఈ ఏడాది అంతకు మంచి సునామీ సృష్టిస్తోంది. తాజాగా వెండి ధర ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈరోజు కిలో వెండిపై రూ.15,000 పెరిగి ఏకంగా రూ.3, 07,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. దీంతో కొనుగోలుదారులు వామ్మో అంటూ హడలెత్తిపోతున్నారు. అలాగే బంగారం ధర కూడా టాప్ లేపుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,090 పెరిగింది. మొత్తానికి సంక్రాంతికి వెండి, బంగారం ధరలు మోత మోగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: నిరసనకారుల్ని ఉరి తీస్తే కఠిన చర్యలుంటాయి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.15,000 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,07,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Zelenskyy: భారత్ పర్యటనకు జెలెన్స్కీ.. ఎప్పుడంటే..!
ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,090 పెరగగా బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,000 పెరగగా రూ.1,31,650 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.820 పెరగగా రూ.1,07,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.