పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు ఏడాది చివరిలో శాంతించాయి. నిన్న కొంతమేర తగ్గిన ధరలు.. ఈరోజు అయితే భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. తులం గోల్డ్ ధరపై రూ.3,050 తగ్గగా.. కిలో వెండిపై రూ.18,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Putin AI Video: మోడీ, జెలెన్‌స్కీకి పుతిన్ క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏఐ వీడియో వైరల్
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.3,050 తగ్గగా.. రూ.1,36,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,800 తగ్గగా రూ.1,24,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,510 తగ్గగా రూ.1,01,930 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండకపోయేది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇక సిల్వర్ ధర బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈరోజు కిలో వెండిపై ఏకంగా రూ.18,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,58,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది.