JK Forest: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్ర స్థావరంపై స్పెషల్ పోలీసుల దాడులు.. ఆయుధాలు స్వాధీనం
- జమ్ముకాశ్మీర్‌లో ఉగ్ర స్థావరంపై స్పెషల్ పోలీసుల దాడులు
- ఆయుధాలు స్వాధీనం
- మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ముకాశ్మీర్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ బృందం దాడులు నిర్వహించింది. ఒక ఉగ్రవాద స్థావరంపై దాడి చేసింది. ఉగ్రవా ద స్థావరంలో రైఫిల్, 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో మరోసారి భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నారు. స్పెషల్ పోలీసుల దాడితో దేశ వ్యతిరేక శక్తుల కుట్ర బయటపడింది.
ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
Also Read
జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) థాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని భలారా అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద విజయాన్ని సాధించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ ఎస్ఎస్‌పీ దోడా సందీప్ మెహతా పర్యవేక్షణలో జరిగింది. పక్కా సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించారు. అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తుండగా ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 22 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Thailand-Cambodia War: మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. వైమానిక దాడులతో టెన్షన్
అయితే ఆయుధాలు ఎవరు దాచి పెట్టారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది. నవంబర్‌లో ఇదే ప్రాంతంలో దాడులు నిర్వహించారు. కానీ అప్పుడు బయటపడని ఆయుధాలు.. తాజాగా బయటపడడంతో ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?