రెండు రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియిన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,500 కి చేరింది. 10 గ్రాముల24 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.76,500కి పడిపోయింది.