గత కొన్నిరోజులుగా బంగారం ధరలు కొంతమేర పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం మెల్లిగా తగ్గుతూ తిరిగి సాధారణ జనజీవనం ప్రారంభం కాబోతున్న తరుణంలో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం ముందుకు వస్తుండటంతో బంగారం వ్యాపారం తిరిగి గాడిలో పడినట్టు కనిపిస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.45,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.50,070కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.76,300 కి చేరింది.