పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. దీపావళికి ముందు జెట్‌స్పీడ్‌లో ధరలు దూసుకెళ్లాయి. ధరలు ఆకాశన్నంటడంతో బంగారం ప్రియులు లబోదిబో అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉండడంతో ప్రస్తుతం ధరలు దిగొస్తున్నాయి. బుధవారం భారీగా ధరలు తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.3,380 తగ్గగా.. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 3, 380 తగ్గగా రూ.1, 27, 200 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 3, 100 తగ్గగా రూ.1, 16, 600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 2, 540 తగ్గగా రూ.95, 400 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం.. ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై
వెండి ధరలు కూడా ఉపశమనం కలిగించాయి. కిలో వెండి ధరపై రూ.2,000 తగ్గి రూ.1, 62, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 80, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 62, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు