Budget 1947 vs 2026 Budget: భారత్‌లో మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 1947 vs 2026 Budget: 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. స్వాతంత్ర్య భారత్‌లో తొలిసారిగా బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశ పెట్టారు? ఎన్ని కోట్లతో బడ్జెట్‌ను అంచనా వేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. 1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే అమలయ్యింది. ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రధానంగా.. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం గురించి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పట్లో బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? అనే అంశాల గురించి ఆసక్తికరంగా ఉంటాయి. నాడు ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు, వ్యయం అంచనా.. రూ.197.39 కోట్లు, లోటు.. రూ.26.24 కోట్లుగా ప్రవేశ పెట్టారు.
READ MORE: Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
Also Read
ఆ వివరాలు తెలుసుకుందామా.. (అంకెలు రూ.కోట్లలో)
రెవెన్యూ అంచనా: రూ.171.15 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.197.39 కోట్లు
రెవెన్యూ లోటు: రూ. 26.24 కోట్లు
రక్షణశాఖకు: రూ. 92.74 కోట్లు
ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: రూ.119 కోట్లు
కస్టమ్స్ ఆదాయం: రూ. 50.5 కోట్లు
ఫారెక్స్ నిల్వలు: రూ.1,547 కోట్లు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!