బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశవ్యాప్తంగా మరోసారి పసిడి ధరలు పైకి కదిలాయి.. ఇవాళ బంగారం ధర రూ. 260 పెరిగింది.. దీంతో, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,090 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800కి పెరిగింది.. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,980 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,650. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,980 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 47,650. ఇక, ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,980 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.47,650కు పెరిగింది..
Read Also: Astrology: జూన్ 28, సోమవారం దినఫలాలు
ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే.. నిన్న నిలకడగా కొనసాగిన పుత్తడి రేటు ఈరోజు పెరిగింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పైకి కదిలి రూ.51,980కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పైకి కదిలి రూ. 47,650గా ఉంది.. మరోవైపు పసిడి దారిలోనే వెండి ధర కూడా పెరిగింది.. రూ. 300 పైకి కదలడంతో కిలో వెండి ధర రూ. 66 వేలకు ఎగసింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్పల్పంగా పెరిగింది బంగారం ధర.. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.03 శాతం పెరిగి 1825 డాలర్లకు చేరుకోగా.. వెండి ధర మాత్రం కిందకు దిగింది.. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గడంతో 21.15 డాలర్లకు క్షీణించింది.