Flipkart Big Bang Diwali Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Bang Diwali Sale) 2025 తేదీలను ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 10, 2025 నుండే ఎర్లీ యాక్సెస్‌ను పొందవచ్చు. బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో వివిధ రకాల గాడ్జెట్‌లు (స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్‌లు), గృహోపకరణాలు (Home Appliances), ఫ్యాషన్ వస్తువులతో సహా అన్ని కేటగిరీల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. ముఖ్యంగా ఆపిల్, డెల్, ఎల్‌జీ, రియల్‌మీ, హెచ్‌పి, షియోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్లపై కస్టమర్‌లు పలు ఆఫర్లను పొందవచ్చు.
Indian Nobel Laureates: ఇప్పటి వరకు భారత్‌కు ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో తెలుసా!
ఇకపోతే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ ప్రస్తుతం వార్షిక ధర రూ.1,499 నుండి రూ.1,249కి తగ్గింపు ధర వద్ద లభిస్తుండగా, తరచుగా కొనుగోళ్లు చేసే కస్టమర్‌లకు వారి కొనుగోళ్ల ద్వారా సూపర్‌కాయిన్‌లను (SuperCoins) పొంది, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇక రాబోయే ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డుతో (SBI Card) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు ఇంకా ఈఎంఐ (EMI) లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు (Instant Discount) లభిస్తుంది.
Champion: డెకాయిట్ తో ‘ఛాంపియన్’ పోటీ.. గెలుపెవరిది?
కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే కొనుగోలుదారులు అదనపు క్యాష్‌బ్యాక్, రివార్డులను పొందుతారు. ఈ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ముగింపు తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇది ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ముగించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025, కొనసాగుతున్న ఫెస్టివ్ ధమాకా సేల్ తర్వాత కొనసాగనుంది.