Champion: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌తో అనుబంధం ఉన్న స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా, గత కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా అని అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ రావడంతో వాటికీ చెక్ పడినట్లు అయ్యింది.
ఇదివరకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) క్లాప్ కొడుతున్న మోషన్ పోస్టర్‌ను సషూటింగ్ మొదలైనట్లుగా విడుదల చేశారు. మల్లి ఇప్పుడు సినిమా సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. విడుదలైన పోస్టర్ ను గమనించినట్లయితే.. ‘ఛాంపియన్’ సినిమాను కాస్త భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. హీరో రోషన్ స్టైలిష్ లుక్‌లో, విమానం తలుపు వద్ద కనిపిస్తున్న పోస్టర్‌పై “This Christmas 25 DEC 25” అని సినిమా విడుదల తేదీని తెలిపారు సినిమా బృందం. దీంతో ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ సందర్బంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదే రోజున అడవి శేషు హీరోగా నటించిన డెకాయిట్ కూడా విడుదల కానుంది. దీనితో ఈ రెండు సినిమాలలో విజయం ఎవరు అందుకుంటారో అని ప్రేక్షకుల్లో చిన్న క్యూరియాసిటీ మొదలైంది.
2025 Nobel Prize: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
యాక్షన్, స్పోర్ట్స్ అంశాలు ఉన్నట్లు కనిపిస్తున్న చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా మిగిలిన అప్‌డేట్‌లను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాకు నిర్మాతగా అశ్వినీ దత్, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని, సినిమాటోగ్రఫీగా నథనియల్ వెంకటేశ్వర రావు, ఎడిటర్ గా నవీన్ నూలి ఉన్నారు.