Kia Carens Clavis: కియా ఇండియా తాజాగా విడుదల చేసిన కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ EV మోడళ్లకు భారతీయ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే ఈ రెండు మోడళ్ల కలిపి 21,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ సాధించాయి. ఇందులో 20,000+ బుకింగ్స్ ICE మోడల్‌కి, 1,000+ బుకింగ్స్ EV మోడల్‌కి లభించాయి. ఈ సందర్బంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జూన్సు చో మాట్లాడుతూ.. కేరెన్స్ క్లావిస్, క్లావిస్…
భారత కార్ మార్కెట్‌లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్‌లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌పై నజర్ పెట్టింది.
India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు…
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్‌తో…
ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు…