ఇకపై ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తీరాల్సిందేనని అమెజాన్ హెచ్చరించింది. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని వారు ఇతర కంపెనీల్లో పని చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా తన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, తన కార్యకలాపాలను కొరటాల శివ అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో కొనసాగాలనుకోవడం లేదని కొరటాల శివ తెలిపారు. ఇకపై మీడియా మిత్రుల ద్వారా తన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తానని ఆయన చెబుతున్నారు. జనాలతో తన…