పాన్ కార్డుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త రూల్‌ను ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ వెల్లడించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు-1962లో సీబీడీటీ పలు సవరణలు చేసింది. కో ఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇప్పటికే ఒక రోజులో బ్యాంకులో రూ.50 వేల కన్నా ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ వివరాలు వెల్లడించాలన్న నిబంధన అమలులో ఉంది.
Google: గూగుల్‌లో ఇవి సెర్చ్ చేస్తున్నారా? అయితే జైలుకు వెళ్లాల్సిందే..!!
కాగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలి. వాహనాల కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఒకేసారి రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కన్నా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం లాంటి పలు సందర్భాల్లో పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా తమ పాన్ నెంబర్ వెల్లడించాలి.