ప్రస్తుతం ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్‌ను ఆశ్రయించడం అందరికీ అలవాటైపోయింది. నిజానికి మనకు సెర్చ్ ఇంజిన్‌లు చాలానే అందుబాటులో ఉన్నా గూగుల్‌ను వాడేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది గూగుల్‌లో ఏది వెతికినా పర్లేదులే అని భావిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కఠిన చట్టాల ప్రకారం.. గూగుల్‌లో లేదా ఇతర సెర్చ్ ఇంజిన్ లలో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ: చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్ష తప్పదు. పొరపాటున సెర్చ్ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
బాంబుల తయారీ: బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్లే. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
అబార్షన్: అబార్షన్ చేయడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు. ఒకవేళ వెతికితే జైలు శిక్ష తప్పదు. గర్భస్రావాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించింది. అబార్షన్ అనేది డాక్టర్ ఆమోదం తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను వెతకడానికి ముందు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి.