UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI పేమెంట్స్‌కు త్వరలో ఛార్జీలు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు PhonePe CEO సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.. భారతీయ వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.. UPI భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. “UPI భారతీయ వినియోగదారులందరికీ ఉచితంగానే ఉంది.. ఇకపై కూడా ఉచితంగానే ఉంటుంది. UPI పేమెంట్స్ చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు” అని పేర్కొన్నారు.
ఇటీవల లోక్‌సభలో Payment and Settlement Systems Act, 2007కు సవరణలు చేసే బిల్లును ఆమోదించడంతో UPI ఛార్జీలపై చర్చ మొదలైంది. ఈ సవరణ ద్వారా UPI సహా ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఏర్పడుతుంది. అయితే దీనిపై Payments Council of India కీలక వివరణ ఇచ్చింది. వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఉచితంగానే UPI సేవలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి UPI వినియోగదారులకు ఉచితంగానే ఉందని, ఇకపై కూడా భారతీయులు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా కిరాణా దుకాణాల వంటి చిన్న వ్యాపారులు UPI చెల్లింపులను స్వీకరించేటప్పుడు Merchant Discount Rate (MDR) చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని Payments Council of India వెల్లడించింది.
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
అయితే UPI వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులను దీర్ఘకాలికంగా నిర్వహించేందుకు స్థిరమైన ఆర్థిక నమూనాను రూపొందించడంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థగా UPI ఎదిగిన నేపథ్యంలో దాని మౌలిక వసతులకు అవసరమైన నిధులపై ఈ చర్చ జరుగుతోందని వివరించింది. అదే సమయంలో వినియోగదారులు, చిన్న వ్యాపారులపై భారం పడకుండా రక్షణ కల్పించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం UPI చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఛార్జీల భయం అవసరం లేదని PhonePe CEO ప్రకటన, Payments Council of India వివరణ ద్వారా స్పష్టమవుతోంది.
𝐔𝐏𝐈 𝐢𝐬 𝐚𝐧𝐝 𝐰𝐢𝐥𝐥 𝐫𝐞𝐦𝐚𝐢𝐧 𝐟𝐫𝐞𝐞 𝐟𝐨𝐫 𝐚𝐥𝐥 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!
‘Consumers will NOT BE CHARGED anything for making UPI payments.
— Sameer Nigam (@_sameernigam) August 8, 2026
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!