ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది.
Google introduces shop tab for rentals and purchases on Android TV: టెక్ దిగ్గజం ‘గూగుల్’.. కొత్త షాప్ ట్యాబ్‌ను పరిచయం చేసింది. షాప్ ట్యాబ్‌ను బుధవారం నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉన్న శీర్షికలను బ్రౌజ్ చేయడానికి ఈ షాప్ ట్యాబ్ వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఎస్‌లోని అన్ని…
UK Pensioner : యూకేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ప్రతి నెల పింఛన్ వస్తుండేది. సడన్ గా ఆ వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు.
రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా.. రద్దీ ప్రాంతాల్లో ఏదో ఒక మూల కార్ నిలిపి షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ కార్, బైక్ పార్క్ చేసి వెళ్తే ఇక పై కుదరదంటూ హెచ్చరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో ఇక పై పార్కింగ్ చేసే వాహనాలపై ఫీజు వసూలు చేసేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటికే ఎడాపెడా పన్నులతో ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ కార్పోరేషన్ పార్కింగ్…
నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు కూడా లేకపోలేదు.. అయితే, ఆ నవ్వు గోల ఎలా ఉన్నా.. సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది.. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్‌కు…
విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు……
ఒకప్పుడు పబ్లిక్ కంట పడకుండా జాగ్రత్త పడే సినీ సెలెబ్రిటీల ప్రేమజంటలు ఇప్పుడు బాహాటంగానే హద్దులు మీరిపోతున్నారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ తన ప్రియుడు శంతను హజారికతో చేసిన సందడి వైరల్ అవుతోంది. ప్రియుడితోనే ముంబైలో ఉంటున్న శ్రుతి హాసన్ పబ్లిక్‌గా రెచ్చిపోయింది. ఓ సూపర్ మార్కెట్‌లో శ్రుతి హాసన్ చేసిన ముద్దుల రచ్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీకెండ్ సందర్భంగా ఈ రచ్చను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. దీంతో…