పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. రెండు రోజుల పాటు తగ్గినట్టే తగ్గి.. శుక్రవారం మళ్లీ షాకిచ్చాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. తులం బంగారంపై రూ.440 పెరిగాయి. సిల్వర్‌పై ఏకంగా 3,000 పెరిగింది. దీంతో ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా వెండి ధర దూసుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: స్వీట్ గర్ల్ దుబాయ్ వస్తావా అని అడిగాడు? ఢిల్లీ బాబాపై మహిళ ఫిర్యాదు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 పెరిగి రూ.1, 14, 880 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరిగి రూ.1, 05, 300 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరిగి రూ.86,160 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై మాత్రం 3,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,43, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,53,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,43, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ రహస్య చర్చలు