పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. రెండు రోజుల పాటు తగ్గినట్టే తగ్గి.. శుక్రవారం మళ్లీ షాకిచ్చాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. తులం బంగారంపై రూ.440 పెరిగాయి. సిల్వర్‌పై ఏకంగా 3,000 పెరిగింది. దీంతో ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా వెండి ధర దూసుకెళ్తోంది.