ఢిల్లీ బాబా స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పైకి బాబాగా దర్శనమిస్తున్నా.. లోపల ఉన్న అసలు స్వరూపాన్ని బయట పెట్టేవాడు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా.. తనను తాను ‘‘బాబా’’గా స్వామి చైతన్యానంద సరస్వతి చప్పుకునేవాడు. అయితే ఈ ఆధ్యాత్మిక సంస్థలో బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలు చదువుతూ ఉంటారు. అమ్మాయిల పేదరికాన్ని అడ్డంపెట్టుకుని నేరుగా తన మనసులోని కోరికను బయటపెట్టేవాడు. ప్రతి ఒక్కరినీ ‘‘బేబీ’’, ‘‘స్వీట్ గర్ల్’’ అంటూ ముద్దుగా సంబోధించేవాడు. ఇతగాడికి వార్డెన్లు, సిబ్బంది కూడా సంపూర్ణ సహకారం అందించేవారు. నేరుగా అమ్మాయిలను బాబా గదికి తీసుకొచ్చి విడిచిపెట్టేసేవారు. ఇలా 17 మంది విద్యార్థినులతో బలవంతంగా శారీరిక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు. బాబాను ఎవరైనా మహిళలు కలిస్తే.. నేరుగా వారి ఫోన్ చేసి లైంగిక కోరికను వ్యక్తపరిచేవాడు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బండారం అంతా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా 30 మంది విద్యార్థినులు కూడా ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ ఫార్మా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
ఢిల్లీ బాబాపై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తనను బీబీ, స్వీట్ గర్ల్ అంటూ సంబోధించేవాడని.. దుబాయ్‌కు వస్తావని నేరుగా తనను అడిగాడని ఫిర్యాదులో పేర్కొంది. తనపై ‘‘రాబందులాంటి కళ్లు’’ ఉండేవని తెలిపింది. ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన జరిగినప్పుడు ఆమెకు 20 ఏళ్ల వయసు. బాబా దుర్మార్గం తెలియగానే 8 నెలల్లోనే బయటకు వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Heavy Rains: వాయుగుండంగా అల్పపీడనం..! భారీ నుంచి అతి భారీ వర్షాలు..
‘‘ఇది నా జీవితంలో అత్యంత కష్టతరమైన కాలం. నేను ఇనిస్టిట్యూట్‌లో చేరిన వెంటనే బాబా నాకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. అతను నన్ను ‘‘బేబీ’’, ‘‘స్వీట్ గర్ల్’’ అని పిలిచాడు. సాయంత్రం 6:30 గంటలకు తరగతులు ముగిసిన తర్వాత అతను నన్ను తన కార్యాలయానికి పిలిచి వేధించేవాడు’’ అని ఆమె చెప్పింది. తనను చాలా ప్రతిభావంతురాలి వంటూ బాబా పొగిడేవాడని.. దుబాయ్‌లో చదవిస్తానని.. ఖర్చులన్నీ తానే భర్తిస్తానని చెప్పేవాడని వాపోయింది.
‘‘బాబా సిబ్బంది కూడా తనపై అధిక ఒత్తిడి తీసుకొచ్చేవారని.. మొబైల్ లాక్కుని హాస్టల్‌లో ఒంటరిగా ఉండాలని బలవంతం చేసేవారని.. ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. రాత్రిపూట ఫోన్ కాల్ చేసి పిలిచేవాడని.. తనపై అతడికి రాబందులాంటి కన్ను ఉండేది.’’ అని ఆమె పేర్కొంది. ఒక రోజు బాబా ఫోన్ చేసి మంచి హోటల్‌కు డిన్నర్‌కు వెళ్దామని.. అక్కడే బస చేద్దామని అడిగారని.. దీంతో తాను చాలా భయపడిపోయినట్లు తెలిపింది. ఎప్పుడు కలిసినా అనుచితంగా తాకుతూనే ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఒకరోజు మధురకు రావాలని కోరాడని.. దీంతో వస్తువులన్నీ హాస్టల్‌లో వదిలేసి పారిపోయినట్లు చెప్పింది. ఇక ఆయనతో సంబంధం ఉన్న అమ్మాయిలనైతే మాటిమాటికి గదికి రావాలని ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపింది.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ అంతటా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
