Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..
- పెరిగిన జియో రిఛార్జ్ ధరలు..
- జియో దారిలోనే ఎయిర్‌టెల్
- వొడాఫోన్ ఇండియా..
- త్వరలో ఛార్జీలను పెంచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ టారిఫ్‌లను పెంచతాయని తెలుస్తోంది. త్వరలో భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ సర్వీస్ రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. గురువారం జియో తన టారిఫ్‌లను సవరించింది. కొత్త అపరిమిత ప్లాన్లను ప్రారంభించింది.
Read Also: Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్‌సభ ఎన్నికలనే నిదర్శనం..
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ కూడా సుస్థిర వృద్ధికి అవసరమైన టారిఫ్‌ల పెంపుదలని దీర్ఘకాలంగా సమర్ధిస్తున్నందున, టారిఫ్ పెంపును అనుసరించాలనే భావిస్తున్నారు. టెలికాం పరిశ్రమలో చివరిసారిగా 20 శాతం టారిఫ్ పెంపు డిసెంబర్ 2021లో జరిగింది. అంతకుముందు డిసెంబర్ 2019లో టారిఫ్‌లను పెంచాయి. జియో 2016లో సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారి టారిఫ్లను పెంచింది. 2019 పెంపు సుంకాన్ని 20-40% పెంచింది, 2021 పెంపు 20% పెరిగింది.
‘‘5G మరియు AI టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరిశ్రమ ఆవిష్కరణలు మరియు స్థిరమైన వృద్ధిని నడిపించే దిశలో కొత్త ప్లాన్‌ల పరిచయం ఒక అడుగు’’ అని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. జియో డిసెంబర్ 2021లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు మొబైల్ సర్వీస్ రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్ ఎంట్రీ-లెవల్ మొబైల్ సేవల ప్లాన్‌ను 2023 ప్రారంభంలో రూ.99 నుండి రూ.155కి దాదాపు 56 శాతం పెంచింది. జియో దేశవ్యాప్తంగా 47 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది, దాదాపు 41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?