గతేడాది టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల అసహనంతో మళ్లీ తగ్గింపు ధరలతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ టెల్కోలు తక్కువ ధరలతో ఎక్కువ బెనిఫిట్స్ ను అందించే ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. పోన్ యూజ్ చేయాలంటే రీఛార్జ్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. లేదంటే సర్వీసులు నిలిచిపోతాయి. మరి మీరు సూపర్ బెనిఫిట్స్ తో లభించే రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి. ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. దాదాపు 3 నెలలపాటు నిరంతరాయంగా సేవలు పొందొచ్చు.
Jio Plan:
జియో తన కస్టమర్లకు 84 రోజుల వ్యాలిడిటీతో రెండు రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. వాటిల్లో ఒకటి రూ. 799 ప్లాన్. మరొకటి రూ. 889 రీఛార్జ్ ప్లాన్. ఈ రెండు ప్లాన్స్ కూడా యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 GB డేటా, మొత్తం 126 GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సావన్ ప్రో వంటి సేవలను పొందొచ్చు.
Airtel Plan:
ఎయిర్ టెల్ యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటితో వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రూ. 509 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 6 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. ఈ ప్లాన్‌తో HelloTunes, Airtel Xtreme యాప్, Apollo 24/7 వంటి అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
డేటా ఎక్కువ వినియోగించే వారికి 84 రోజుల వ్యాలిడిటీతో మరో రెండు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి రూ. 1798. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే డైలీ 3GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. నెట్ ఫ్లిక్స్ యాక్సెస్ అందిస్తోంది. మరొకటి రూ. 1029 ప్లాన్. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా అందుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. డిస్నీ+హాట్ స్టార్ సేవలను పొందొచ్చు.
BSNL Plan:
చౌక ధరల్లో క్రేజీ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తున్నది బీఎస్ఎన్ఎల్. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 628 ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే డైలీ 3 GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMS లభిస్తాయి. మొత్తం 252 GB డేటా ఈ ప్లాన్‌లో అందించబడుతుంది.
VI Plan:
84 రోజుల వ్యాలిడిటీతో రూ. 509 ప్లాన్ వోడాఫోన్ ఐడియా అందిస్తోంది. ఇందులో అపరిమిత కాల్స్, 6 GB డేటా, 1000 SMS లభిస్తాయి. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలనుకునే వారు ఈ రీచార్జ్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి.