Bigg boss 6: శనివారం బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్లను నాగార్జున చాలా సీరియస్‌గా నిర్వహించాడు. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరి తప్పొప్పులు చెబుతూ ఒకరకంగా వారి పనితీరును పోస్ట్ మార్టమ్ చేశాడు. చిత్రం ఏమంటే.. అందులో కెప్టెన్స్ కు కూడా మినహాయింపు లేకుండా పోయింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్యకూ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరితో మంచిగా ఉండాలని, స్నేహంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని, బాలాదిత్య నుండి తాను కానీ ఆడియెన్స్ గానీ అలాంటి మెతక వైఖరి కోరుకోవడం లేదని చెప్పాడు. అలానే కొత్తగా కెప్టెన్ అయిన రాజశేఖర్ ను అభినందిస్తూనే, ‘అడుక్కుని కెప్టెన్ కావడంలో గొప్పతనం లేద’ని కామెంట్ చేశాడు. పోరాడి కాకుండా రాజశేఖర్ జాలి, దయతో కెప్టెన్ అయ్యాడని, సెల్ఫ్ సింపతి ఎప్పటికీ మంచిది కాదని తెలిపాడు.
ఆ తర్వాత వేస్ట్ పర్సన్‌ను ఎంపిక చేసే సమయంలో రాజశేఖర్ ఓటు వేయాల్సి వచ్చినప్పుడు ‘ఓ వేస్ట్ ఆటగాడికి మరో వేస్ట్ పర్శన్‌ను ఎంపిక చేసే ఛాన్స్ రావడం చిత్రంగా ఉంద’ని నాగార్జున ఎగతాళి చేశాడు. కొత్త కెప్టెన్‌గా బాధ్యతలను సరిగా నిర్వహించి, పేరు తెచ్చుకోమని హితవు పలికాడు. ఇక వేస్ట్ పర్శన్స్ గా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న వారిలో షానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాగా ఇంటిలోని మెజారిటీ సభ్యులు శ్రీసత్యను జైలుకు పంపమని చెప్పడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తి కాగానే ఆమె గార్డెన్ ఏరియాలోని జైలుకు వెళ్ళబోతోంది. ఈ సీజన్ లో గీతూ తర్వాత జైలుకు వెళ్ళబోతున్న సెకండ్ మెంబర్ శ్రీసత్య.