బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత వారితో అవసరమేరకే అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత సిరికి తిరిగి కాస్తంత దగ్గరైన షణ్ణులో ఆమె పట్ల పొసెసివ్ నెస్ బాగా పెరిగినట్టు అనిపిస్తోంది. తను పక్కన లేనప్పుడు ఎవరు సిరితో మాట్లాడినా, అతను చూపు ఆ వైపే ఉంటోంది. అలానే తన సమక్షంలో లేదా తాను దూరంగా ఉన్నప్పుడు సిరి ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడినా, తన గురించి సరదాగా కామెంట్ చేసినా షణ్ణు తట్టుకోలేకపోతున్నాడు. ఇదే విషయంలో సిరితో వాదనకు దిగాడు.
Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!
కాజల్ అన్నట్టుగానే సిరిది డబుల్ ఫేస్ అని షణ్ణు కూడా కోపంలో అనేశాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా ఎలా ప్రవర్తిస్తావ్? ఇది తప్పు అంటూ సిరికి చెప్పాడు. అయితే దానికి బదులుగా సిరి ‘ఎప్పుడూ నాదే తప్పు అని అంటావ్? నన్నే విమర్శిస్తావ్’ అని బదిలిస్తే కూడా షణ్ముఖ్ దానిని స్వీకరించలేకపోయాడు. సిరి తనతో తప్పితే ఎవరితోనూ కలిసి ఉండకూడదనే భావన అతనిలో బలంగా ఉందనిపిస్తోంది. అందుకే సిరి ఆ తర్వాత దగ్గరకు వచ్చి సారీ చెప్పినా… వినకుండా, ”నన్ను వదిలి దూరంగా వెళ్ళిపో, నీ స్నేహం నాకు అక్కర్లేదు, రెండు రోజులుగా నాకు దీపునే గుర్తొస్తోంది. తనైతే నాతో ఇలా ప్రవర్తించేది కాదు, అసలు బిగ్ బాస్ హౌస్ నుండే నాకు వెళ్ళిపోవాలని అనిపిస్తోంది” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. షణ్ణు అలా ఏడవడాన్ని తట్టుకోలేక సిరి బాత్ రూమ్ లోకి వెళ్ళి తలను గోడకేసి కొట్టుకుని ఆవేదనను కొంత తగ్గించుకుంది. ఆ తర్వాత రవి పిలవడంతో బయటకు వచ్చినా, వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో షణ్ముఖ్ కాస్తంత డీలా పడిపోయాడు, సిరికి ఏం చేయాలో అతన్ని ఎలా సముదాయించాలో తెలియని పరిస్థితి. మిగిలిన వాళ్ళు కూడా వారిద్దరి మధ్య వ్యవహారంలో మనం ఎందుకు తలదూర్చాలనే ఉద్దేశ్యంతో దూరంగానే ఉన్నారు. మరి షణ్ణు, సిరి మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ ఎప్పుడు? ఎలా తీరుతుందో చూడాలి.