ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ రాజ్ తరుణ్‌ని జూదగాడుగా ప్రెజెంట్ చేయగా, నాగార్జున లాంచ్ చేసిన సినిమా తాజా ట్రైలర్‌లో ఈ క్యారెక్టర్‌లోని మరో కోణాన్ని చూపించారు.

Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !

రాజ్ తరుణ్ థియేటర్ వద్ద నాగార్జున భారీ కటౌట్ ముందు డ్యాన్స్ చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. రాజ్ తరుణ్ ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పరిచయం అయ్యాడు. సెక్యూరిటీ గార్డులను అసహ్యించుకునే కంపెనీ ఉద్యోగి కాశీష్ ఖాన్‌ను ఆరాధిస్తాడు. ఆ తరువాత మళ్ళీ తన పాత రోల్ లోకి చేంజ్ అయిన రాజ్ తరుణ్ ఒరిజినాలిటీ చూపించారు. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ ఓ చిన్న పాత్రలో కన్పించింది. రాజ్ తరుణ్ తన గ్రామానికి ప్రెసిడెంట్ అవుతానంటూ సవాలు చేయడంతో ట్రైలర్ పూర్తయ్యింది. ట్రైలర్ పూర్తిగా ఉల్లాసంగా ఉంది. శ్రీను గవిరెడ్డి ‘అనుభవించు రాజా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్విసి ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles