బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం నామినేషన్స్ లో సిరి, రవి, కాజల్, సన్నీ, మానస్ ఉన్నారు. చిత్రం ఏమంటే… బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ లో ఈ ఐదుగురికి కూడా చక్కని ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఓట్లు పోటాపోటీగా పడే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కు గురవుతారనే విషయంలో వీక్షకులలో చాలా క్యూరియాసిటీ నెలకొంది.
Read Also : హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే… జస్వంత్ ఇప్పటికే అనారోగ్య కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి వైద్యం చేయించుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ సమయానికి అతని ఆరోగ్యం ఫర్వాలేదని భావించిన బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్ లో ఉంచాడు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే తిరిగి జెస్సీ అనారోగ్యం పాలయ్యాడు. దాంతో ఈ వారం అతన్ని బయటకు పంపేసి, ఇక ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవచ్చునని తెలుస్తోంది. లాస్ట్ సీజన్ లోనూ ఇలానే నోయల్ అనారోగ్యానికి గురైనప్పుడు అర్థాంతరంగా అతన్ని వైద్యం కోసం బయటకు పంపి, ఆ తర్వాత రెండు రోజులకే శాశ్వతంగా షో నుండి పంపేశారు. తానెలాగూ హౌస్ నుండి వెళ్ళిపోతున్నాను కాబట్టి వేరెవరినీ ఆ వారం ఎలిమినేట్ చేయవద్దని అప్పుడు నోయల్ నాగార్జునను కోరాడు. ఇప్పుడు కూడా అలానే జెస్సీని పంపేసి, ఇక ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయరని తెలుస్తోంది. మరి ఇవాళ, రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ చూస్తే కానీ ఏం జరిగిందనేది తెలియదు!