Bigg Boss Telugu 8 Shocking Elimination on Cards: విజయవంతంగా ఏడు సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి రెండో వారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎవరూ ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు ప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య ఓం, కిరాక్ సీత, పృథ్వి వంటి వాళ్లు నామినేట్ అయ్యారు. అయితే ఆన్లైన్ పోల్స్ లో అనధికారికంగా వెలువడుతున్న సమాచారం ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్ ఈ ఓటింగ్ లో మంచి ప్రతిభ కనబరిచినట్లుగా తెలుస్తోంది. నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంఠ, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య, పృథ్వి లాంటి వాళ్లకు గట్టిగానే ఓట్లు పడ్డాయి. శేఖర్ భాషా కి కూడా ఈ లిస్టులో దాదాపుగా మూడు నాలుగు స్థానాలల్లోనే ఉన్నాడు. కానీ ఒరిజినల్ బిగ్ బాస్ ఓట్ల ప్రకారం శేఖర్ భాషాకి లీస్ట్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.
Comedian Satya : భలే దొరికావయ్యా.. సత్యా!
ఈ నేపద్యంలోనే ఎవరు ఊహించని విధంగా శేఖర్ భాషాని ఈ వారం బయటికి పంపేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి శేఖర్ భాష హౌస్ లో కాస్త కామెడీ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కావలసినంత కంటెంట్ ఇవ్వడం లేదని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. సెప్టెంబర్ 14వ తేదీన ఆమె బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని డాక్టర్లు డేట్ ఇచ్చారు. అయినా దాన్ని కూడా సింపతీకి వాడుకోకుండా కంటెంట్ ఇవ్వకుండా శేఖర్ భాష ఉంటున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. శేఖర్ భాషా జెన్యూన్ గా ఉంటున్నాడు కాబట్టి అతనికి ఎలా అయినా ఓట్లు పడతాయి అనుకుని అందరూ మిగతా వాళ్ళకి ఓట్లు వేసి ఉండవచ్చని, అందువల్లే అతనికి ఓటింగ్ శాతం సరిపోక బయటికి పంపేసే పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయి అనేది ఆదివారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు.