బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 12 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం ఇంటికి వెళ్లారు.. అయితే వీరిద్దరూ రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే రతిక అశ్విని కన్నా ఎక్కువగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బయట ఆమె కోసం పని చేసే పీఆర్ టీమ్స్ ఉన్నాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. పల్లవి ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది..
ఇక రతికా పాప ఆడే గేమ్ లలో నిజం లేదని తెలిసిపోయింది.. దాంతో హౌస్ లో ఎప్పుడూ గొడవలు కూడా పడుతూ వస్తుంది.. జనాలకు చిరాకు తెప్పించింది.. బయట పరిస్థితులు, హౌస్లో ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసుకున్న రతిక గేమ్ మార్చింది. అదే సమయంలో కన్ఫ్యూషన్ లో పడింది. అగ్రెసివ్ గా ఆడితే ప్రమాదం అనుకుని తగ్గింది.. అంతగా జనాలను ఆకట్టుకోలేక పోయింది.. దాంతో జనాలు కూడా పాపకు ఓట్లు వెయ్యలేక పోయారు..
12వ వారం తప్పలేదు. డబుల్ ఎలిమినేషన్ లో రతిక ఇంటి బాట పట్టింది. అశ్విని శనివారం ఎలిమినేట్ కాగా… ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. అర్జున్-రతిక డేంజర్ జోన్లోకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఈ ఇద్దరిలో ఎవరికీ పాస్ వాడేందుకు ఆసక్తి చూపలేదు.. నాగార్జున రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మొత్తంగా రతిక రోజ్ 9 వరాలు హౌస్లో ఉంది. రతిక వారానికి రూ. 2 లక్షల ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టిందట.. దాంతో తొమ్మిది వారాలకు గాను రూ.18 లక్షలు తీసుకుందని తెలుస్తుంది.. ఇక ఈ వారం యావర్, శోభా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..