Damini: బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు ముగిశాయి. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ తో హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇక ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. మొదట కిరణ్ రాధోడ్ హౌస్ నుంచి బయటకు రాగా.. నెక్స్ట్ వీక్ షకీలా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వీక్ దామిని ఎలిమినేట్ అయ్యింది. సింగర్ గా దామిని హౌస్ లో అడుగుపెట్టింది. తనదైన శైలితో ఇంట్లో అందరిని తనవైపు తిప్పుకుంది. అమ్మలా అందరికి వండిపెట్టింది. ఇక మొదటి వారంలో కొద్దిగా గేమ్ ఆడినా.. ఆ తరువాత వారంలో ఆమెకు ఆడే అవకాశం రాలేదు. మొదట నుంచి కూడా దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని కంటెస్టెంట్స్ చెప్పినా కూడా ఆమె తాను అలా కాదని చెప్పుకొచ్చింది.
Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
ఇక తెలుగులో బూతులు మాట్లాడకూడదని చెప్పిన ఆమె ఇంగ్లిష్ లో బూతులు మాట్లాడి నామినేషన్స్ లో నిలిచింది. రెండు వారాలు సేఫ్ గా ఇంట్లో ఉన్న ఆమె మూడో వారంలో ఇంట్లో ఉండి బయటకు వచ్చింది. ఇక ఈ మూడు వారాలకు దామిని తీసుకున్న రెమ్యూనిరేషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దామిని వారానికి రూ.2 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.. ఈ లెక్కన మూడు వారాలకుగానూ ఆమె రూ.6 లక్షల రెమ్యునరేషన్ అందుకుందట. ఇక దీంతో గేమ్ సరిగ్గా ఆడకపోయినా.. డబ్బులు మాత్రం బాగానే అందుకుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.