హిందూ పండగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగకి నెల ముందు నుండే సందడి మొదలవుతుంది. గణేష్ చందాలతో చిన్న పిల్లలు, యువకులు హడావిడి చేస్తుంటారు. ఇక పండగ రోజు వచ్చిందంటే డీజే పెట్టి మారుమోగిస్తారు. అసలు గణేష్ చరితుర్థి వెనకున్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chaturdhi: వినాయకుని విగ్రహాలు మట్టితో చెయ్యడానికి గల కారణాలు
ఒకానొక సమయంలో గజాసురుడు అనే శివ భక్తుడు ఉండే వాడు. అతను శివుడు కోసం గోర తప్పస్సుని చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా అతడు నువ్వు ఎప్పుడు నాతోనే తోనే ఉండాలి అందుకే నా కడుపులో నువ్వు నివాసం ఉండు స్వామి అని కోరుకుంటాడు. శివుడు సరేనని ఆ భక్తుడి కడుపులో ఉంటాడు. ఇది ఏ మాత్రం ఇష్టం లేని పార్వతి తన భర్త కోసం విష్ణువుని శరణు కోరగా విష్ణువు శివుడిని ఆ భక్తుడి కడుపునుండి బయటకి వచ్చేలా చేస్తాడు.
Read also:Mahadev Gambling App: ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు.. దుబాయ్లో పెళ్లికి హాజరైన బాలీవుడ్ ప్రముఖులు
ఇది తెలుసుకున్న పార్వతి తన భర్త అయినటువంటి శివుడు వచ్చేసరికి ముస్తాబై ఉండాలని స్నానానికి వెళ్తూ తాను స్నానం కోసం తెచ్చుకున్న నలుగుపిండి తో ఒక బొమ్మని చేస్తుంది . ఆ బొమ్మ ఎంతో ముందుగా ఉంటుంది. దీనితో పార్వతి దేవి తన తండ్రి ఇచ్చిన వరం ఉపయోగించి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ తరువాత తాను స్నానానికి వెళ్తూ తాను ప్రాణం పోసిన బాలుడిని కాపలా పెట్టి ఎవరు వచ్చిన లోపలి పంపొద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది. ఇంతలో శివుడు రాగ ఆ బాలుడు లోనికి పోనివ్వకుండా అడ్డుకుంటాడు.
Read also:INDIA Bloc: ఇండియా కూటమి భోపాల్ ర్యాలీ రద్దు.. అందుకే రద్దు చేసుకుందన్న బీజేపీ
శివుడు ఎంత నచ్చ చెప్పాలని చూసిన వినడు దీనితో శివునికి కోపం వచ్చి ఆ బాలుడి తలను త్రిసూలంతో ఖండిస్తాడు. పార్వతి తాను ప్రాణంపోసిన తన కొడుకని చంపినందుకు శివుడి పైన కోప్పడుతుంది. తన కొడుకుని బ్రతికించాల్సిందే అని పట్టుపడుతుంది. దీనితో శివుడు నందిని పిలిచి ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుని చనిపోయిన వాళ్ళ తలని తీసుకు రమ్మని చెప్తాడు. కాసేపటికి నంది ఓ ఏనుగు తలను తెచ్చి ఉత్తరం వైపు తలపెట్టి ఎవరు చనిపోలేదు. కేవలం ఈ ఏనుగు మాత్రమే చనిపోయి ఉంది అని ఆ ఏనుగు తలని శివునికి ఇవ్వగా.. శివుడు ఆ తలని చనిపోయిన బాలుడికి పెట్టి బ్రతికిస్తాడు. అలా మనకి వినాయకుడు ఆవిర్భవించాడు.