Kartika Masa Rituals: కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Masa Rituals: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసం లో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు. అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం అనే కాదు హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇలా మామిడాకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు. అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. చెట్టు నుండి తెంపిన తరువాత కూడా మామిడాకులకు కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వదిలే శక్తి ఉంది. కనుక మామిడాకులను గుమ్మానికి కడితే అవి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తాయి. అందుకే తోరణాలను కడుతారు.
Read also:IT Rides in Hyderabad: మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో సోదాలు
Also Read
- Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
ఇక ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. కనుక మనలో వ్యాధినిరోధక తగ్గిపోతుంది. ఇలా వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే నది నీరు అనేక కొండలు, కోనలు, లోయలు దాటుకుంటూ వస్తుంది. ఇలా కొండలు, కోనలు, లోయల మీదుగా ప్రయాణించే సమయంలో ఆ నీటిలో అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలు కలుస్తాయి. కనుక ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలానే నది నీరు చల్లగా ఉంటుంది. ఇలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కనుక ఈ మాసంలో చాలామంది చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇక నదీస్నానం అనంతరం నేతి దీపాలను నది లో వదులుతారు. ఇలా చేయడం వల్ల దీపాల వేడికి వాతావరణం లోని క్రిములు, కీటకాలు, దోమలు నశించిపోయి గాలి శుద్ధవుతుంది.
Read also:RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు
అలానే నేతి దీపాలు వెలిగించడం వల్ల గాలిలో ఆక్సీజన్ శాతం పెరుగుతుంది. ఆ గాలిని పీల్చ్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే ఇంట్లోను గుడి లోనూ నేతి దీపాలను వెలిగిస్తారు. ఇక పసుపులో యాంటీబ్యాక్టీయిల్ గుణాలు ఉంటాయని అందరికి తెలిసిందే అయితే చలికాలంలో కాళ్ళు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే ఇలా పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే మహిళలు కాళ్ళకు పసుపు రాసుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యం. అలానే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. దీనికి కారణం ఉసిరి చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినే సమయంలో ఆ చెట్టు ఆకులు పైన రాలుతుంటాయి. అలా పైన రాలిన ఆకుల్లోని ఔషధ గుణాలను శరీరం గ్రహిస్తుంది. అలానే ఇలా కలిసి భోజనం చేయడం వల్ల మానవ సంబంధాలు కూడా బలపడతాయి. అలానే ఉపవాసం చేయడం వల్ల శరీరం లో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి చురుకుదనం, ఉత్సాహం, శక్తి అందుతాయి. ఇక మాసం తినక పోవడానికి కారణం.. ఈ మాసం లో వేడి తీవ్రత తక్కువగా ఉంటుంది. కనుక మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే ఈ మాసంలో సాత్విక ఆహరం అంటే కూరాయగలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!