Krishna Janmashtami 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీ కృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి వ్రతం చేస్తారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. రేపే శ్రీకృష్ణుడి జన్మష్టమి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం..
READ MORE: Medak: దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని 25 ఏళ్ళ కన్న కొడుకుని చంపిన తల్లి..
శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి , సత్యభామ , జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి, ఇంకొకరు సత్యభామ. అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది.
READ MORE: Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ హీరోగా మూవీ
ఇదిలా ఉండగా.. కన్నయ్య పూజా విధానం గురించి తెలుసుకుందాం.. శ్రీ కృష్ణాష్టమి రోజున భగవానుడిని పూజించే సమయంలో స్వామికి తులసి మాలను సమర్పించాలి. తరువాత కన్నయ్యను తులసిదళాలతో పూజించాలి. తులసి మొక్క దగ్గర శంఖం ఉంచి పూజలు చేయాలి. ఇలా పూజలు చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి.. సానుకూలత… ప్రశాంత ఏర్పడుతుంది. స్వామి పూజ ముగిసిన తరువాత స్వామికి నైవేద్యం సమర్పించాలి. స్వీట్లు… పాలు.. వెన్న తో పాటు తులసి దళాలను కూడా సమర్పించాలి. తులసి ఆకులను స్వామికి నివేదన చేస్తే త్వరగా స్వీకరించి భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.