Mother Kills 25-Year-Old Son for Opposing Illicit Affair: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని 25 ఏళ్ళ కన్న కొడుకుని తల్లి చంపేసింది. హత్యకు ప్రియుడు సైతం సహకరించారు. 9 నెలల తర్వాత అహ్మద్ పాషా (25) హత్య కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ (మం) వెంకటాయపల్లిలో ఘటన చోటు చేసుకుంది. యువకుడి మృతిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో 9 నెలలుగా విషయం బయటపడలేదు. పోలీసులు వివిధ చోట్ల మృతుడి పోస్టర్లు అంటించడంతో ఓ వ్యక్తి గుర్తుపట్టి పోలీసులకు వివరాలు అందించారు. ఆ వ్యక్తి వివరాల ఆధారంగా తల్లిని విచారించగా బాగోతం బయటపడింది.
READ MORE: Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ హీరోగా మూవీ
పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ 23న తూప్రాన్ పరిధిలోని హల్దీ వాగులో ఓ వక్తి శవం బయటపడింది. ఎవరో మర్డర్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మృతుడికి సంబంధించిన ఫొటోలు వైరల్ చేశారు. పోలీసులకు కొన్ని సాంకేతిక ఆధారాలు దొరికాయి. వెంకటాయపల్లికి చెందిన 25 ఏళ్ల అహ్మద్ పాషాగా గుర్తించారు. ఎవరు చంపారు అనే కోణంగా దర్యాప్తు చేశారు. దీంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అహ్మద్ తల్లి రెహనా(48) చంపినట్లు తేలింది. ఆమె భర్త చిన్నప్పుడే చనిపోవడంతో.. భిక్షపతి(55) అనే వ్యక్తితో 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయంలో తల్లి కొడుకుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. దీంతో ఆ తల్లి గొంతును తాడుతో బిగించి చంపేసింది. ప్రియుడితో కలిసి ఆ మృతదేహాన్ని వాగులో పారేసింది.
READ MORE: Alia Bhatt: అడల్ట్ మూవీలో అలియా భట్