Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన Guerrilla 450 మోడల్ సంబంధించి ఓ కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకు ఉండే కలర్స్ నుం కొనసాగిస్తూ.. షాడో యాష్ (Shadow Ash) అనే ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తిసుకవచ్చింది. పుణెలో జరిగిన GRRR Nights X Underground ఈవెంట్‌లో టపాస్వి రేసింగ్ భాగస్వామ్యంతో దీనిని లాంచ్ చేశారు. ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్ ధరను కంపెనీ రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించింది. ఇది Guerrilla 450 లోని డాష్, ట్రిప్పర్ డాష్ వంటి వేరియంట్లలో లభ్యం కానుంది.
Russia Ukraine War: ఆగని యుద్ధం.. ఉక్రెయిన్‌లోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా!
ఈ కొత్త కలర్ స్కీమ్‌లో ఆలివ్ గ్రీన్ ట్యాంక్‌తో పాటు బ్లాక్ డీటైలింగ్ తీసుకవచ్చారు. దీని ద్వారా బైక్ మరింత మస్క్యులర్ డిజైన్‌గా కనిపిస్తుందని కామపీనీ పేర్కొంది. కొత్త షాడో ఆష్‌తో పాటు ఈ బైక్ ప్రస్తుతం బ్రావా బ్లూ, యెల్లో రిబ్బన్, గోల్డ్ డిప్, ప్లాయా బ్లాక్, పెయిక్స్ బ్రోంజ్, స్మోక్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ఇక బైక్ ధరల విషయానికి వస్తే, Guerrilla 450 బేస్ మోడల్ ధర ఇప్పటికీ రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమవుతోంది. అయితే ఇందులో మెకానికల్‌గా ఎటువంటి మార్పులు లేవు.
CM Chandrababu: ఇక మాటల్లేవ్.. యాక్షన్ మాత్రమే.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఇదివరకు ఉన్న 452 సీసీ లిక్విడ్-కూల్డ్ ‘షెర్పా 450’ ఇంజిన్ నే ఇందులో కూడా ఉపయోగించారు. ఇది హిమాలయన్ మోడల్‌లో కూడా అందుబాటులో ఉంది. Guerrilla 450 బైక్లో 40hp పవర్ 8,000 rpm వద్ద, 40 Nm టార్క్ 5,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ బైక్‌కు గేర్‌బాక్స్ ట్యూనింగ్ ప్రత్యేకంగా Guerrilla రైడింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా సెట్ చేశారు. ఇక బైకు సస్పెన్షన్ విషయానికి వస్తే ముందర 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లు (140 mm ట్రావెల్), వెనుక మోనో-షాక్ (150 mm ట్రావెల్) అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 310 mm డిస్క్ డబుల్ పిస్టన్ కాలిపర్‌తో, వెనుక 270 mm సింగిల్ డిస్క్ సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో లభిస్తుంది. ఇక భద్రత కోసం డ్యుయల్ ఛానల్ ABS అందించారు. వీల్ సెటప్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండగా.. వీటిపై CEAT టైర్లు andhinchar. ఇక ముందుర 120/70 R17, వెనుక 160/60 R17 సైజ్ టైర్స్ ను అందించారు.