OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్‌లో లభ్యమయ్యే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
Pawan Singh : సజీవదహనమే దిక్కు అంటూ..ఊహించని షాక్ ఇచ్చిన పవన్ సింగ్ భార్య జ్యోతి
ఇక ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్‌తో 112 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీనికి గరిష్ట వేగం 25 కి.మీ/గం మాత్రమే. ఇది 1.5 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది తేలికగా, లోడ్లు మోసుకెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. వీటితోపాటు, కంపెనీ ప్రకటించిన ప్రకారం రూ.499తో రిజర్వ్ చేసుకోవచ్చు. డెలివరీలు ఇప్పటికే మొదలు కానుండగా మరింత ఆలస్యం అయ్యాయి. మొత్తంగా తక్కువ ఖర్చుతో, వృత్తిపరమైన అవసరాలకు అనువైన స్కూటర్ కోసం చూస్తున్న గిగ్ వర్కర్లకు ఓలా గిగ్ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!