భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రస్తుతం ఒక విభిన్న రకమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లక్నోలో ‘సైయా సేవా కరే’ ఆల్బమ్ ప్రమోషన్ కార్యక్రమంలో నటి అంజలితో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేజ్ మీద మాట్లాడుతున్న అంజలి రాఘవ్‌ను, పక్కన నిలిచిన పవన్ సింగ్ తన నడుమును అనుమతి లేకుండా పదే పదే తాకాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు పవన్ సింగ్ ప్రవర్తనను క్షమించేది లేదు అని విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై స్పందిస్తూ అంజలి రాఘవ్ తాను నిజంగా బాధపడ్డా నని, ఈ ఘటన తర్వాత భోజ్‌పురి సినిమాల్లో ఇకపై నటించబోనని స్పష్టం చేశారు. అలాగే ‘ ఓ మహిళ అనుమతి లేకుండా తాకడం అసహ్యకరంగా ఉంది, ఇంకోసారి ఇలా జరగదు క్షమించండి’ అంటూ పవన్ సింగ్ కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు సీన్ లోకి పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది..
Also Read : Anushka : జయసూర్య ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏడేళ్లుగా నా భర్తతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న, కానీ అతను చుట్టూ ఉన్న వ్యక్తులు నా మెసేజ్‌లు, కాల్స్‌కి స్పందించలేదని, నీతో చివరి సారిగా మాట్లాడకుంటే, నా బాధను అర్థం చేసుకోకుండా ఉంటే, నేను సజీవదహనం చేసుకొని చనిపోతాను” అంటూ జ్యోతి ఎమోషనల్‌గా పేర్కొంది. పవన్ సింగ్ గతంలో నీలం సింగ్ అనే యువతితో వివాహం చేసుకున్నప్పటికి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత జ్యోతి సింగ్‌తో వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ వివాదం రాజకీయ, సామాజిక, సినీ వర్గాల్లో ఈ చర్చ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది.