మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది.
దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మార్కెట్‌లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్,…
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
September 2022 car sales record an all-time high in India: దేశంలో కార్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్ల అమ్మకాలు ఆల్ టైం రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి. గత రెండేళ్లుగా క్షీణిస్తూ వస్తున్న ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మళ్లీ పూర్వస్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ నెలలో మొత్తంగా 3,55,946 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇది అంతకుముందు నెల ఆగస్టు సేల్స్…
Record Level Car Sales: జులై నెలలో 3 లక్షల 42 వేల 326 కార్లు అమ్ముడుపోయాయి. ఒక నెలలో ఇన్ని కార్ల విక్రయాలు జరగటం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో కూడా ఇలా రికార్డ్ స్థాయి ఫలితాలు వెలువడటం విశేషమే.