బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ అంతే సంతోషంగా ఉంటూ, ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ, విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటిది తాజాగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
Also Read: Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇటీవల ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తమ నటుడిగా నేను అందుకున్న తొలి అవార్డు ఇది. ఈ అవార్డుకు నేను అర్హుడినని భావించిన కార్యక్రమం నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతులకు నా ధన్యవాదాలు. దర్శకుడు సుజిత్ సర్కార్ వల్లే నేను ఈ సినిమాలో తండ్రి పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేయగలిగాను. కాబట్టి.. ఈ పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. తోటి నటీనటుల నుంచే ఎంతో స్ఫూర్తి పొందుతున్నా. నా తోటి వారి నటన చూసి వారి నుండి నేను ఎంత నేర్చుకున్న’ అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. ఇంతలోనే..
అక్కడే ఉన్న అర్జున్కపూర్ ‘నేను మీతో మాట్లాడాలి’ అంటూ ఎవరు ఫోన్ చేస్తే నీకు కంగారు వస్తుంది? అని ప్రశ్నించాడు.దానికి అభిషేక్ నవ్వుతూ ‘నీకింకా పెళ్లి కాలేదు. కాబట్టి నువ్వు ఇలా అడుగుతున్నావు. నీకు పెళ్లి అయి ఉంటే ఈ ప్రశ్నకు నీ వద్ద సమాధానం ఉండేది.. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే అసలైన గందరగోళం మొదలవుతుంది. ముఖ్యంగా ఆ ఫోన్ కాల్స్ ఒత్తిడికి గురి చేస్తాయి’ అని బదులిచ్చారు.