ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.