Hero Xtreme 160R 4V: భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్తగా Xtreme 160R 4V క్రూజ్ కంట్రోల్ వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో కూడా ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 163.2cc సింగిల్-సిలిండర్, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌నే అందిస్తున్నారు. ఇది 8,500rpm వద్ద 16.9hp పవర్, 6,500rpm వద్ద 14.6Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ క్రూజ్ కంట్రోల్ వేరియంట్ ప్రత్యేకత కొత్తగా వచ్చిన ఫీచర్లలోనే ఉంది.
Reliance Hyperscale Data Center: గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఇక బైక్ ముందుభాగంలో ఇప్పుడు పూర్తిగా కొత్త డిజైన్‌తో కూడిన LED హెడ్‌లైట్‌ను అందించారు. దీని డిజైన్ Xtreme 250R నుండి ప్రేరణ పొందింది. అంతేకాకుండా 4.2 అంగుళాల రంగురంగుల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. కొత్త గ్రాఫిక్స్, అప్‌డేట్ చేసిన పెయింట్ స్కీమ్స్‌తో మరింత స్పోర్టీ ఫీల్‌ను అందించేలా మోడల్‌ను నాలుగు కొత్త కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంచారు. డీలర్‌షిప్‌లలో కనిపించిన ఈ కొత్త మోడల్, కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ అనంతరం ఇప్పుడు ధరతో సహా ప్రకటించబడింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1,34,100గా నిర్ణయించబడింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే సుమారు రూ. 4,500 ఎక్కువ.
రగ్గడ్ లుక్ తో రాయల్ ఎంట్రీ ఇచ్చిన Royal Enfield Meteor 350 Sundowner Orange బైకు..!
ఈ కొత్త Xtreme 160R 4V వేరియంట్‌లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ క్రూజ్ కంట్రోల్. 160cc సెగ్మెంట్‌లో ఇటువంటి టెక్నాలజీని అందిస్తున్న మొదటి బైక్ ఇదే. అలాగే, రైడ్-బై-వైర్ సిస్టమ్‌ను కూడా ఇందులో జోడించారు. రైడర్స్ రెయిన్ మోడ్, రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటి మూడు రైడింగ్ మోడ్‌లను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ టెక్నాలజీని హీరో ఇప్పటికే Xtreme 125R, Glamour X వంటి మోడళ్లలో ప్రవేశపెట్టింది. కొత్త స్విచ్‌గేర్‌తో రైడర్లు మోడ్‌లను మార్చడం, క్రూజ్ కంట్రోల్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభంగా చేసుకోవచ్చు.